![]() |
![]() |

ఈటీవీ 30 ఏళ్ళ సంబరాలు త్వరలో జరుపుకోవడానికి సిద్దమయ్యింది. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ తో పాటు సింగర్స్, డాన్సర్స్, షో జడ్జెస్, జబర్దస్త్ ఆర్టిస్ట్స్, కమెడియన్స్, సినిమా స్టార్స్ , డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అన్ని రంగాల వాళ్ళు వచ్చారు. ఇక ఇందులో ఆది, సుడిగాలి సుధీర్ వేసిన జోక్ హైలైట్ గా నిలిచింది. వీళ్ళిద్దరూ పెళ్లి గెటప్పుల్లో నుదిటి బాసికం కూడా కట్టుకుని వచ్చారు. ఇక సుధీర్ తన ఓల్డ్ మ్యానరిజాన్ని అదేనండి కళ్లజోడును స్టైల్ గా పెట్టుకుని చూపించాడు. తర్వాత "మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ అనౌన్స్ చేసాడు. "కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మొగుడిని" అంటూ ఆది చాలా ఆతృతగా చెప్పాడు. ఇక సుధీర్ అంతే ఆత్రుతతో "శోభనం ముందా తర్వాతా" అంటూ అడిగాడు. దాంతో ఆది షాకయ్యాడు.
ఇక ఫారియా వచ్చి అటు చిరంజీవితో స్టెప్పులేసింది. అలాగే సింగల్ గా దబిడి దబిడి సాంగ్ కి డాన్స్ ఇరగదీసింది. ఇక ఈ షోకి సుధీర్ రావడంతో నెటిజన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. రకరకాల కామెంట్స్ పెట్టారు. "వచ్చాడు.. వచ్చాడు.. వీరుడొచ్చాడు..సుధీర్ అన్న కూడా ఇందులో భాగం అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సుధీర్ అన్న - పంచెస్ మాష్టర్ ఆది ఇద్దరి ఫన్ సూపర్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి - బుల్లితెర మెగాస్టార్ సుధీర్ ఒక ప్రోగ్రాంలో ఉండడం బాగుంది. రష్మీ కూడా ఉంటే ఇంకా అదిరిపోయేది." అంటున్నారు.
![]() |
![]() |